టాలీవుడ్ స్టార్ రాజశేఖర్ ను మనం ఇప్పటి వరకు తెరపై కేవలం హీరోగా మాత్రమే చూసాం. త్వరలో ఆయన్ను మనం వెండి తెరపై విలన్ గా చూడబోతున్నాం. తన సొంత కూతురు హీరోయిన్ గా నటిస్తున్న సినిమాకు రాజశేఖర్ విలన్ గా నటించడానికి ఒప్పుకున్నాడు.
రాజశేఖర్ కూతురు శివాని "వందకు వంద" మూవీతో హీరోయిన్ గా అరంగేట్రం చేయనుంది. ఈ సినిమాలో విలన్ పాత్ర చేయాలని రాజశేఖర్ నిర్ణయించుకున్నారు. ఈ మధ్య రాజశేఖర్ కు హీరోగా అస్సలు కలిసి రావడం లేదు. దీంతో ఆయన్ను కొందరు స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు తమ సినిమాల్లో విలన్ పాత్రలు చేయమని అడిగినా... ఆయన ఒప్పుకోలేదు.

0 comments: